సమ్మర్ ప్యాక్స్

అందమే ఆనందం

face packs
face packs

ప్రస్తుతం బయట ఎండలు మండిపోతున్నాయి. వేసవిలో వేధించే అతి పెద్ద సమస్య సన్ ట్యాన్ . సన్ స్క్రీన్ లోషన్లు , గొడుగులు, దుపట్టాలు వాడుతూ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎండకు చర్మం నల్లగా తయారవటం మానదు. మరి ఇలాంటప్పుడు క్రమం తప్పకుండా ట్యాన్ ను తొలగించే పేస్ ప్యాక్స్ వేసుకుంటూ ఉండాలి.

కుంకుమ పువ్వు ప్యాక్ :

తయారు చేసే విధానం : 4 టేబుల్ స్పూన్ల పాలు వేడిచేసి దానిలో నాలుగు చుక్కల నిమ్మ రసం , చిటికెడు కుంకుమ పువ్వు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చెవులు,మెడకు పట్టించి ఆరాక చల్లని నీటి తో కడిగేయాలి . ఆ తర్వాత, మాయిశ్చరైజర్ రాయాలి.

టొమాటో ప్యాక్:

తయారు చేసే విధానం : ఒక టొమాటోను తరిగి దానికి ఒక టేబుల్ స్పూన్ పాలు చేర్చాలి. ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలిపి పట్టించాలి.

శెనగ పిండి ప్యాక్ :

తయారు చేసే విధానం: 2 టీ స్పూన్ల శెనగపిండికి చిటికెడు పసుపు, అర టీ స్పూన్ నారింజ తురుము, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిముషాలు ఆగి ఆరిపోయిన ప్రదేశాల్లో రోజ్ వాటర్ చిలకరించాలి. తర్వాత వేళ్ళతో కడిగేసు కోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేయాలి .

‘నాడి’ (ఆరోగ్య సంబంధిత విశేషాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health1/