ఏపిలో మండుతున్న ఎండలు

temperature
temperature

అమరావతి: ఏపిలో రోజురోజుకి ఎండల తీవ్రత పెరగడంతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంల ఈరోజు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు అయింది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. ప్రకాశం జిల్లా పెద్దారవీడులో 45.69, దర్శిలో 45.65, లింగసముద్రంలో 45.21, కంభంలో 45.48, కడపలో 45.4, చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడులో 45.05, మహానందిలో 45.51, వెంకటగిరిలో 45.16 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 11 ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. 157 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీలు నమోదైనట్టు తెలిపింది.రాష్ట్రంలో మరోసారి వడగాల్పులు పెరగనున్నాయి. ఈ నెల 25 నుంచి 29 వరకు తీవ్రస్థాయిలో వడగాల్పులు ఉండొచ్చని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/