విన్నవించుకో..

బైబుల్ సారాంశం

ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తున్న భయంకరమైన వైరస్‌ కరోనా. చైనాలో ఆరంభమైన ఈ వైరస్‌ వేగంగా ప్రపంచదేశాలల్లో విస్తరిస్తున్నది.

దీనికి ఇంకా మందు కనిపెట్టలేదు. దానిపై నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చైనా, ఇటలీ, ఇరాన్‌ దేశాలలో అత్యధిక మంది కరోనావైరస్‌తో మరణిస్తున్నారు.

ఇదంతా ఎందుకు వివరిస్తున్నాను అంటే ఈ సమయంలో విశ్వాసులంగా మనం ఏమీ చేయాలి? ప్రార్థన చేయాలి.

దేవాదిదేవ్ఞడిని ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా విన్నవించుకోవాలి.

‘అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవ్ఞని యెదుట మనస్సును నిబ్బరము చేసికొంటిని.

నేను నా దేవ్ఞడైన యెహోవా యెదుట ప్రార్థన చేసి యొప్పుకొన్నదేమనగా-ప్రభువా, మహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడు…

(దాని 9:3,4). దానియేలు గొప్ప ప్రార్థనాయోధుడు. ఆయన ప్రార్థనావిధానాన్ని గమనిస్తే తన పితరుల పాపాల నుంచి ఆరంభించి, తనవరకు జరిగిన తప్పిదాలు, పొరపాట్లు, పాపాలను ఒప్పుకుంటూ చేసిన ప్రార్థన మనకు నేటికీ ఆదర్శనీయమే.

దానియేలు ఎలాంటి పాపం చేయలేదు. ఆయన దేవ్ఞడియందు భయభక్తులు గల వ్యక్తి. ఇలాంటి వ్యక్తి తన పాపాలను కూడా ఒప్పుకుంటూ దేవ్ఞడికి మొఱ€పెట్టుకున్నాడు.

నీ ఆజ్ఞల్ని అనుసరించేవారిపై నీ కృప, నిబంధనను జ్ఞాపకం చేసుకుంటావ్ఞ అంటూ దేవ్ఞడిని బ్రతిమిలాడుకుంటున్నాడు. మనకు కరోనా వైరస్‌ అనే ఒక ఉపద్రవం ముంచుకుని వచ్చింది. ఈ సమయంలో భారంతో ప్రార్థన చేయాలి.

మనపొరపాట్లు, తప్పిదాలు, లోపాలు ఏవీ ఉన్నా దేవాదిదేవ్ఞడిని క్షమించమని వేడుకోవాలి. అప్పుడే దేవ్ఞడి కనికరాన్ని పొందగలం.

హైటెక్‌ నాగరిక ప్రపంచంలో టెక్నాలజీ పెరిగేకొద్దీ మనం దేవ్ఞడితో గడిపే సమయం తగ్గిపోయింది అనేది వాస్తవం. దేవ్ఞడి కంటే భౌతికమైన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నాం.. దేవ్ఞడు అన్యాయస్తుడు కాడు.

మనల్ని ఈవిధంగా శిక్షించేందుకు. కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఆయనను బ్రతిమిలాడు ప్రార్థింద్దాం. ఈ తెగులను తీసివేయమని వేడుకుందాం. దేవ్ఞడి చిత్తమైతే ప్రాణాలను కాపాడమని వేడుకుందాం.

ఎందుకంటే మన జీవితం శాశ్వితం కాదు. ఈ భూమిలో మనం కేవలం యాత్రికులం మాత్రమే. దేవ్ఞడి చిత్తమైతే మరికొంతకాలం జీవించేందుకు అవకాశం ఇవ్వమని వేడుకుందాం.

  • పి.వాణీపుష్ప

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/