ఫస్ట్ టైం నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్

Sumanth
Sumanth

సుమంత్ ఫస్ట్ టైం నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. విరాట్ ఫిల్మ్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకంపై అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో సుమంత్ హీరో.  అంజు కురియన్ హీరోయిన్. శివాజీరాజా – సత్య – ఆదిత్యమీనన్ – కల్యాణ్ – షఫీ తదితరులు నటిస్తున్నారు.‘ఇదం జగత్’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. జొన్నలగడ్డ పద్మావతి – గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సుమంత్ ఈ చిత్రంలో వైవిధమైన పాత్రలో నటిస్తున్నారని చిత్ర నిర్మాతలు తెలిపారు. సినిమాలో ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ పాత్ర ఉంటుందట.. ప్రేక్షకులు సుమంత్ ను చూసి ఖచ్చితంగా థ్రిల్ ఫీలవుతారని హామీ ఇస్తున్నారు. సినిమాలో సుమంత్ క్యారెక్టరే హైలెట్ అని చెబుతున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఆగస్టులో చివర్లో ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.