ఇండిపెండెంట్‌గా మాండ్య నుంచి సుమలత

sumalatha
sumalatha


బెంగళూరు: సినీ నటి, మాజీ దివంగత కాంగ్రెస్‌ నాయకుడు అంబరీష్‌ సతీమణి సుమలత కాంగ్రెస్‌కు షాకిచ్చారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నానని ఆమె ప్రకటించారు. కర్ణాటక నియోజకవర్గం మాండ్య నుంచి పోటీ చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కర్ణాటకలో జేడిఎస్‌-కాంగ్రెస్‌ కూటమిలో భాగంగా మాండ్యా నియోజకవర్గాన్ని జేడిఎస్‌ అభ్యర్థికి కేటాయించారు. ఈ నియోజకవర్గం నుంచి సియం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. ఆమెకు కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ దక్కకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
గత వారం ఆమె బిజెపి సీనియర్‌ నేత ఎస్‌ఎం కృష్టతో భేటి అయ్యారు. నాడు ఆమె మాట్లాడుతూ..కుదిరితే బిజెపి నుంచి లేదా స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానన్నారు. తుది నిర్ణయాన్ని మార్చి 18న తేదీన ప్రకటిస్తానని చెప్పిన సుమలత తన మనసులో మాటను ఇవాళ వెల్లడించారు.


వార్తా ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/