స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్ల‌తో సుమ సంద‌డి

suma, warner, laxman, bhuvaneswar
suma, warner, laxman, bhuvaneswar


హైదరాబాద్‌: మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న 12వ ఐపీఎల్‌ సీజన్‌కు అన్ని జట్ల ఆటగాళ్లు సన్నద్ధమౌతున్నారు. కాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సభ్యులు ప్రాక్టీస్‌ తర్వాత తీరిక వేళల్లో యాడ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ప్రముఖ టీవీ యాంకర్‌ సుమతో కలిసి డేవిడ్‌ వార్నర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ సందడి చేశారు. ఓ టీవీ యాడ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ జట్టు సభ్యులతో కలిసి సుమ అలరించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
ఈవారంతో అతడిపై నిషేధం పూర్తికానుంది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున వార్నర్‌ మళ్లీ బరిలో దిగే అవకాశముంది. ఈనెల 24న కోల్‌కతాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మొదటి
మ్యాచ్‌ ఆడనుంది.