యాంకరింగ్ కు దూరం కాబోతున్న వార్తలపై సుమ క్లారిటీ

బుల్లితెర సూపర్ స్టార్ అంటే ఎవరైనా సుమ పేరే చెపుతారు. అగ్ర హీరోలు , హీరోయిన్స్ అంటే తెలియని వారు ఉంటారు కానీ యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు. చిన్న , పెద్ద , ముసలి ఇలా అందర్నీ తన మాటలతో మాయ చేస్తుంది సుమ. అందుకే సుమ అంటే చిత్రసీమలోనే కాదు అన్ని వర్గాల ప్రజలకు ఇష్టమే. అలాంటి సుమ.. తాజాగా ఓ షో ప్రోమోలో ‘యాంకరింగ్ నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంటున్నా. ఇంతకాలం నన్ను ఆదరించినందుకు చాలా థాంక్స్’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ఆ వీడియో వైరల్ అయ్యేసరికి సుమ నిజంగానే యాంకరింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటుందేమోనని అంతా అనుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవ్వడం మొదలయ్యాయి.

దీంతో సుమ విరామం తీసుకోవడం ఫై క్లారిటీ ఇచ్చింది. ‘నేను రీసెంట్గా ఒక న్యూఇయర్ ఈవెంట్ కు యాంకరింగ్ చేశా. అందులో కాస్త ఎమోషనల్ అయిన మాట వాస్తవమే. కానీ, అది ఇండస్ట్రీని వీడుతున్నట్లు కాదు. ఈ విషయంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రోమో చూసి అంచనాకు రావద్దు. ఈ ఈవెంట్ మొత్తం చూస్తే మీకు అసలు విషయం తెలుస్తుంది. నేను టీవీ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం పుట్టా. ఇండస్ట్రీ విడిచి ఎక్కడికీ వెళ్లను. మీ వల్ల హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉండండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ విషెస్ చెప్పింది. ఈ క్లారిటీ తో అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.