అమరావతిలో సుజనా చౌదరికి భూములున్నాయి

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటనపై బిజెపి నేత సుజానా చౌదరి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ ట్విట్టర్‌లో సుజానా చౌదరిపై పలు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రాల రాజధానుల ఎంపిక కేంద్రం పరిధిలో ఉండదని చట్టసభల సభ్యులందరికీ తెలుసునని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. బిజెపి ఎంపీ జీవిఎల్‌ నర్సింహారావు కూడా ఈ విషయం స్పష్టం చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు కోవర్టు వై. సుజానా చౌదరి మాత్రం కేంద్రం చూస్తు ఊరుకోదని బట్టలు చింపుకుంటున్నాడని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. అసలు విషయమేమిటంటే అమరావతిలో సుజానాకు భూములున్నాయని అందుకే ఆయన ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడని ఎంపీ ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/