సుప్రీం కోర్టు తీర్పులను సైతం లెక్కచేయట్లేదు

ఏపి ప్రభుత్వం .. రాజ్యాంగ వ్యవస్థలను లెక్కచేయకుండా పాలన చేస్తానంటే కుదరదు

Sujana Chowdary
Sujana Chowdary

న్యూఢిల్లీ: బిజెపి నేత సుజనా చౌదరి ఏపి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ వైఎస్‌ఆర్‌సిపి తన తీరు మార్చుకోవట్లేదని మండిపడ్డారు. ‘ఏపి ప్రజలు వైఎస్‌ఆర్‌సిపి ని 151 సీట్లతో గెలిపించారు కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలను, చట్టాలను లెక్కచేయకుండా పాలన చేస్తానంటే కుదరదు. ఇప్పటికైనా మీ పనితీరును సమీక్షించుకుని, ప్రజలకు సరైన పాలన అందించాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలకు కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా చీమకుట్టినట్టయినా లేదు. చివరకు సుప్రీం కోర్టు తీర్పులను సైతం లెక్కచేయకుండా తామనుకున్నట్టుగా పరిపాలించాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది’ అని సుజనా చౌదరి మండిపడ్డారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/