సుజనా చౌదరి..చంద్రబాబునాయుడు కోవర్టు..

అని బిజెపి వాళ్లకు ముందే తెలుసు

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం బిజెపిలో ఉన్న ఎంపీ సుజనా చౌదరి చంద్రబాబునాయుడి కోవర్టు అని బిజెపి వాళ్లకు ముందే తెలుసునని విజయసాయిరెడ్డి అన్నారు. సుజనా చౌదరితో పాటు మరో ముగ్గుర్ని చంద్రబాబునాయుడు బిజెపిలోకి పంపించాడని వాళ్లకు అర్థమైంది. ఢిల్లీలో సుజనా చౌదరి ఎవరెవరిని కలుస్తారు, ఎవరిని కాపాడటం కోసం పనిచేస్తున్నాడనేది త్వరలోనే బయటపడుతుందన్నారు. వ్యవస్థలను మ్యానేజ్‌ చేయడం ఎల్లవేళలా సాధ్యం కాదని చంద్రబాబునాయుడుకి ట్వీట్‌ ద్వారా విజయసాయిరెడ్డి తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చయండి:https://www.vaartha.com/telangana/