తీపి పదార్థాలకు డిప్రెషన్‌కు సంబంధం !

ఆరోగ్య పరిరక్షణ

sugar depression
sugar depression

దేశంలోని మెజారిటీ ప్రజలకు తియ్యటి పదార్ధాలంటే విపరీతమైన ఇష్టం. కానీ అదే పనిగా తీపి పదార్ధాలను తినడం ద్వారా కొవ్వు పెరుగుతుందని మనందరికి ఇది వరకే తెలుసు. కానీ ఆశ్చర్యకరంగా తీపి పదార్థాలకు డిప్రెషన్‌కు సంబంధం ఉన్నట్లు బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ సైకియాట్రీ నివేదిక తెలిపింది.

అయితే ఆహార పదార్ధాల ద్వారా వ్యక్తి స్పందనలు ఉంటాయని తెలిపింది. కాగా రెండు రకాల ఘగర్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.

1.సింపల్‌ ఘగర్‌ 2. ప్రాసెస్డ్‌ ఘగర్‌

సింపల్‌ ఘగర్‌ : కూరగాయలు, పండ్లలో సింపుల్‌ ఘగర్‌ ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్‌) సమృద్ధిగా లభిస్తాయి.

ప్రాసెస్ట్‌ ఘగర్‌:

ఇందులో ఏ విధమైన పోషక విలువలు, కేలరీలు ఉండవు. ఉదా: చాక్‌లెట్స్‌, సాప్టడ్రింక్స్‌ (కూల్‌డ్రింక్స్‌) అయతే మన శరీరంలో తియ్యటి పదార్థాల చేరాక కార్బోహైడ్రేట్స్‌గా ఉన్న పదార్ధాలను
గ్లూకోజ్‌లోకి మార్చుతాయి.

అయితే తియ్యగి పదార్ధాలు తింటే ఎక్కువ స్థాయిలో దోపమైన్‌ విడుదల వుతుంది (సంతోషం కలిగించే హార్మోన్‌) మరోవైపు ఎక్కువ తియ్యటి పదార్ధాలు తిన్నట్లయితే ఘగర్‌ను స్ధీరీకరించేందుకు రసాయన చర్యలు జరుగుతాయి.

ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ సమస్యలతో బాదపడతారని నివేధిక తెలిపింది.

కాగా ఘగర్‌ ఎక్కువగా తీసుకుంటే పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మానసిక సమస్యలు, డిప్రెషన్‌తో బాధపడతారని సైన్స్‌ రిపోర్ట్‌ జర్నల్‌ అధ్యయనం తెలిపింది.

అయితే ఘగర్‌ (తీపి పదార్థాలు)ను అప్పుడప్పుడు మితంగా తీసుకుంటే సమస్యలు ఉండకపోవచ్చని నివేదిక తెలిపింది.

మరోవైపు ఘగర్‌ సమస్యతో బాదపడేవాళ్లు బాగా జగ్రత్తతో ఉండాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు.

టైప్‌ 1డయాబెటిస్‌ (మధుమేహం) సమస్యతో బాధపడేవారు ఇన్సూలిన్‌ మార్పులను గమనించాలి.

లేకుంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే జీవక్రియల సమతూల్యత కోల్పోయి డిప్రెషన్‌ సమస్యకు దారితీయొచ్చని ప్లస్‌ వన్‌జర్నల్‌ అధ్యయనం పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/