మొటిమలతో బాధపడుతున్నారా?
సౌందర్య పోషణ

ప్రపంచంలో ప్రతి ఒక్కరు నిగనిగలాడే చర్మ సౌందర్యాన్ని కోరుకుంటారు.
కానీ ప్రస్తుత పోటీ యుగంలో త్రీవ ఒత్తిడి, ఆహారపు అలవాట్లు తదితర కారనాలతో మొటిమలు, పొడి చర్మం తదిర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.
ఈ సమస్యతో ఇబ్బదిపడే వారు కాస్మొటిక్స్ మందులు, క్రీమ్స్, వాడి లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తుంటారు. అయితే ఇంటి చిట్కాలతో మొటిమల సమస్యను తగ్గించ వచ్చు.
కాగా నిగనిగలాడే మెరిసే చర్మం కావాలనుకునేవారికి గళ్ల ఉపృ (సీ సాల్ట్ లేదా సముద్రపు ఉప్పు వాడడమే మేలైన పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. మొటిమలతో బాధపడ్తున్న వేలాది మంది సీసాల్ట్ ఉపయోగించి ప్రయోజనం పొందారు.
గళ్ల ఉప్పు (సీ సాల్డ్) ప్రయోజనాలు : గళ్ల ఉప్పులో చర్మ సంరక్షణకు కావాల్సిన పోషకాలు, ఖనిజాలు లభిస్తాయి. అంతేకాక సీ సాల్ట్‌లో ఉండే మెగ్నిషియం, కాల్షియం, సోడియం పొటాషియం తదితర లవణాలతో చర్మం మెరిసేందుకు తోడ్పడుతుంది.
చర్మానికి ఉపయోగించే విధానం :
మొదటగా ఒక బౌల్ (గిన్నె తీసుకోవాలి. తర్వాత టేబుల్ స్పూన్ సేంద్రీయ తేనె, టీస్పూన్ సీసాల్ట్, 6 చుక్కల నిమ్మరసం తదితర మిశ్రమాలను గిన్నెలో వేసి కలపాలి.
మిశ్రమాన్ని కలిపాక మొఖానికి 5 నుంచి 10 నిమిషాలు నెమ్మదిగా మర్దన చేయడం ద్వారా మొటిమలు జిడ్డు చర్మ, పోడిబారినచర్మ సమస్యలు తగ్గుతాయి.
చర్మ సమస్యలతో బాధపడేవారు ఆలస్యం చేయకుండా సీసాల్ట్ వినియోగించుకుంటే చర్మ సంరక్షణకు ఎంతో మేలు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/