`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`

హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో 

Hero Sudheer Babu New Movie
Hero Sudheer Babu New Movie

హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా

నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ…కొత్త ఏడాదిలో ఫస్ట్ డే మనమంతా కలవడం సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి గురించి ఉప్పెన సినిమా ద్వారా చెప్పాం. ఆ అమ్మాయి మంచి నటి అని మాకు తెలుసు. ఇంకా ఈ సినిమా ద్వారా దర్శకుడు, హీరో ఏం చెబుతారో చూడాలి. ఇంద్రగంటి గారు విభిన్నమైన చిత్రాలు చేయగల దర్శకులు. ఆయన యాక్షన్, లవ్, మ్యూజికల్ ఫిల్మ్, ఎంటర్ టైనర్స్ ఇలా అన్ని జానర్స్ సినిమాలు చేయగలరు. ఇంద్రగంటి గారితో సినిమా చేయాలని అనుకునేవాళ్లం. అలాగే హీరో సుధీర్ బాబు వెరీ టాలెంటెడ్. ఆయనతో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేయాలని వెయిట్ చేశాం. ఇలా ఇంద్రగంటి, సుధీర్ బాబు సినిమాకు ప్రెజెంటర్ గా అసోసియేట్ అవడం సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి గురించిచెప్పాలి టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ సీయీవో చెర్రి మాట్లాడుతూ…ఆ అమ్మాయి గురించి చెప్పాలి కథను ఇంద్రగంటి  మోహనకృష్ణ గారు మాకు చెప్పగానే చాలా బాగుందని అనిపించింది. ఈ సినిమాలో అనేక ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి.. అన్నారు.

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ…ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైన మూవీ. ప్రతి సినిమాకు కొత్తగా కథ చెప్పాలని ప్రయత్నిస్తుంటాను. ఆ క్రమంలో వచ్చిన రొమాంటిక్ డ్రామా ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి.

హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ…ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా మొదలైన కొద్ది రోజులకే ఇది నాకు గొప్ప అనుభవం ఇచ్చే సినిమా అవుతుందని అర్థమైంది. కథలోనే మా పాత్రలన్నీ అంత వివరంగా ఉన్నాయి. కొందరికి రొమాంటిక్ పార్ట్, మరికొందరికి ఫ్యామిలీ పార్ట్ నచ్చుతాయి. సినిమా అంతా మన ఇరుగు పొరుగు ఇంట్లో జరిగినంత సహజంగా ఉంటుంది. సుధీర్ బాబు అంత కోపరేట్ చేసే హీరోను చూడలేదు. మన క్యారెక్టర్ మనం చేసేందుకే కష్టపడాలి. అలాంటిది మాకు సపోర్ట్ చేస్తుంటారు. మైత్రీ మూవీస్ మై త్రీ అని చెప్పుకుంటాను. బెంచ్ మార్క్ స్టూడియోస్ కూడా ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి. అన్నారు.

నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రామకృష్ణ, తలైవాసల్ విజయ్, వడ్లమాని శ్రీనివాస్, గోపరాజు రమణ, కళ్యాణి నటరాజన్, ప్రేమ్ సాగర్, విశ్వంత్ దుద్దుపూడి, కునాల్ కౌశిక్ తదితరులు.

అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/