అన్నదమ్ముల మధ్య విబేధాలున్నాయంటూ పుకార్లు లేపొద్దు

నాలుక చీరేస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు

Tej pratap yadav
Tej pratap yadav

రాంచీ: తన తమ్ముడు తేజస్వి యాదవ్‌తో విబేధాలున్నాయంటూ పుకార్లు గుప్పిస్తే నాలుక చీరేస్తా నంటూ ఆర్జేడి చీఫ్‌ లాలూ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ హెచ్చరించారు. తమది భారతంలోని కృష్ణార్జునుల బంధమని అభివర్ణించారు. శుక్రవారం రాంచీ వేదికగా జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేజస్వి ఏదో పనిలో బిజీగా ఉన్నాడు. కాబట్టి అర్జునుడు(తేజస్వి), కృష్ణుడిని(తేజ్‌), యశోద(రబ్రీదేవి) దగ్గరకు వెళ్లమని పంపించాడు. కృష్ణార్జునుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అన్నదమ్ములు విడిపోయారన్న పుకార్లు పుట్టిస్తున్నారు. మళ్లీ ఆ మాట అన్న వాళ్ల నాలుక చీరేస్తా, కృష్ణార్జునుల మధ్యలోకి ఎవరైనా వస్తే, వాళ్లు శ్రీ కృష్ణుడి సుదర్శన చక్రం ప్రతాపాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/