పశ్చిమ బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ మృతి

ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంతాపం

Subrata Mukherjee-File
Subrata Mukherjee-File

Kolkata: పశ్చిమ బెంగాల్ పంచాయతీ శాఖ మంత్రి, సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీ (75)కన్నుమూశారు. ముఖ‌ర్జీ కొంత కాలంగా అనారోగ్య స‌మస్యలతో బాధ ప‌డుతూ ప్రభుత్వ ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు.సుబ్రతా మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ముఖ్యమంత్రి మమత బెనర్జీ పేర్కొన్నారు. జీవితంలో తాను చాలా విషాదాలు చూశానని, కానీ సుబ్రతా ముఖర్జీ మృతి లోటు మాత్రం పూడ్చలేనిదన్నారు. కాగా, తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన చాలాకాలం కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశారు. కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్‌కు సుబ్రతా ముఖర్జీ తొలి మేయర్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే.

క్రీడా వార్తలకు: https://www.vaartha.com/news/sports/