పిల్ల‌ల‌కు కొవాగ్జిన్ వ్యాక్సిన్‌.. అత్యవసర వినియోగానికి గ్రీన్‌సిగ్న‌ల్‌

న్యూఢిల్లీ : 2-18 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య పిల్ల‌ల‌కు కూడా క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి స‌బ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ మంగ‌ళ‌వారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికోసం కొవాగ్జిన్‌ ( Covaxin )వ్యాక్సిన్‌కు అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి వ‌చ్చింది. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇప్ప‌టికే 18 ఏళ్ల వ‌య‌సులోపు పిల్ల‌ల‌పై రెండు, మూడో ద‌శ‌ల ట్ర‌య‌ల్స్ కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించి డేటాను ఇప్ప‌టికే డ్ర‌గ్స్ అండ్ కంప్ట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి స‌మ‌ర్పించింది. మ‌రోవైపు కొవాగ్జిన్‌కు డ‌బ్ల్యూహెచ్‌వో త్వ‌రలోనే అత్య‌వస‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/