బైకుల్లా జైలులో కలుషిత ఆహారం : 104 మంది ఖైదీలకు అస్వస్తత

SUBJAIL
SUBJAIL

బైకుల్లా జైలులో కలుషిత ఆహారం
104 మంది ఖైదీలకు అస్వస్తత

ముంబయి: కలుషిత ఆహారం భుజించడంతో ముంబైలోని బైకుల్లా జైలులో మరో తొమ్మిది మంది ఖైదీలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మొత్తం ఈ సంఖ్య 104మందికి చేరింది. గడచిన నాలుగురోజులుగా జైలులో పంపిణీచేస్తున్న ఆహారం కలుషితం కావడంతో ఖైదీలు ఎక్కువసంఖ్యలో తీవ్ర అస్వస్థతకు లోన వుతున్నారు. ఆదివారం కూడా తొమ్మిది మంది ఖైదీలను జెజె ఆసుపత్రికి చేర్చారు. వీరంతా కడుపునొప్పి తీవ్రంగా ఉందని, వాంతులు విరేచనాలతో వచ్చినట్లు సూపరింటెండెంట్‌ డా.సంజ§్‌ు సురాసే తెలిపారు. ఈనెల 20వ తేదీ బైకుల్లాజైలులోని 81 మంది ఖైదీలు ప్రభుత్వరంగంలోని జెజె ఆసుప్రతికి వచ్చారు. వారు తినే ఆహారం కలుషితం అయిందని అధికారులు అనుమానించారు. శనివారం ఈ సంఖ్య 95కి చేరింది. మరింతగా ఖైదీల్లో ఇదే ఫిర్యాదులు వస్తున్నాయి. ఎక్కువమంది ఖైదీలను డిశ్చార్జిచేసామని, 15 మందిమాత్ర మే ఉన్నారని, వారిలో 13గ్గురు మహిళలు కూడా ఉన్నట్లు సూపరింటెండెంట్‌ తెలిపారు. 13గ్గురిలో ఇద్దరు మహిళలు గర్భవతులని పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ అస్వస్థతకు అసలు కారణంపై విచారణకు ఆదే శించినట్లు తెలిపారు. వీరందరికి యాంటి వైరల్‌ చిక్సిచేస్మాని, ఈనెల 19వ తేదీనుంచే ఖైదీలు రావడం ప్రారంభించారని ఆయన అన్నారు. కొంతమంది ఖైదీలు తమకు అలసటగా ఉందని ఫిర్యాదు చేసారిన జైలు అధికారి వివరించారు.
======