‘జీ’ చైర్మన్‌ సుభాష్‌ చంద్ర రాజీనామా

Subhash Chandra
Subhash Chandra

ఢిల్లీ: టెలివిజన్‌ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్ర తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను కంపెనీ బోర్డు అంగీకరించినట్లు తెలుస్తుంది. రాజీనామా చేసినప్పటికీ ఆయన కంపెనీ బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌గా కొనసాగనున్నారు. జీలో తన 16.5 శాతం వాటాను విక్రయించినట్లు కొద్ది రోజుల క్రితం సుభాష్‌ చంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయనకు 5 శాతం షేర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. చంద్ర తన వాటాను విక్రయించిన తర్వాత ఎస్సెల్‌ గ్రూప్‌ ఆరువేల కోట్ల రూపాయల రుణాన్ని కలిగి ఉంటుంది. ఈ సంస్థ 1992లోనే శాటిలైట్‌ టివి ఛానల్‌ జీ టివిని ప్రారంభించింది. అయితే అంతకు ముందే ఈ కంపెనీ 11 శాతం వాటాను ఒప్పన్‌హైమర్‌ డెవలపింగ్‌ మార్కెట్‌ ఫండ్‌కు నాలుగు వేల కోట్ల రూపాయలకు విక్రయించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/