బిజెపికి బెంగాలీ నటి సుభద్రా రాజీనామా

Subhadra

kolcuta ప్రముఖ బెంగాలీ నటి సుభద్రా ముఖర్జీ బిజెపికి రాజీనామా చేశారు. అనురాగ్‌ ఠాకూర్‌, కపిల్‌ మిశ్రా వంటివారు ఉన్న పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు.

ఢిల్లిలో సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 40 మంది మరణించిన నేపథ్యంలో ఆమె బిజెపిని వీడాలని నిర్ణయించుకున్నారు. బిజెపి పని తీరు నచ్చి 2013లో ఆ పార్టీలో చేరానని సుభద్ర చెప్పారు.

అయితే ఇటీవలి కాలంలో పార్టీ తీరు మారుతోందని, ప్రజల పట్ల ద్వేషం, వారి మతం ఆధారంగా తీర్పు చెప్పడం అనే అంశాలు బిజెపి భావజాలంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని గ్రహించానని ఆమె అన్నారు. అనేక విధాలుగా ఆలోచించిన తరువాత పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆమె అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/