సిఎం జగన్‌తో సమావేశమైన సుబ్బరామిరెడ్డి

రాజ్యసభ సీటుపై చర్చలు జరుపుతున్నారా? అన్న ఉత్కంఠ

CM Jagan and Subbarami Reddy
CM Jagan and Subbarami Reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌తో కాంగ్రెస్‌ నేత సుబ్బరామిరెడ్డి సమావేశమయ్యారు. అయితే మరోవైపు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వీళ్లిద్దరి భేటీ రాష్ట్రంలో ఆసక్తి కలిగిస్తోంది. సుబ్బరామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం మరో నెలతో ముగుస్తుంది. దీంతో ఆయన దీనిపైనే చర్చలు జరుపనున్నారా? అన్నది ఉత్కంఠగా మారింది. అయితే త్వరలోనే జరగబోయే రాజ్యసభ ఎన్నికలో ఏపి నుంచి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థులు ఎవరనే విషయంపై జగన్‌ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపి డిప్యూటీ సిఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డిలను సిఎం జగన్‌ రాజ్యసభకు పంపనున్నట్లు సమాచారం. మరో సీటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి లేదా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపి పరిమళ్‌ సత్వానీకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/