పవన్ ఆలివ్ గ్రీన్ డ్రెస్ కేక పుట్టించింది

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త గ్యాప్ తర్వాత ఏపీలో అడుగుపెట్టారు. మార్చి 14 న జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ విజయవాడ కు చేరుకున్నారు. హైదరాబాద్ నుండి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ ను చూసి అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అయ్యారు. ఆలివ్ గ్రీన్ ప్యాంట్ ధరించిన పవన్ బ్లాక్ టీ షర్ట్ కళ్లద్దాలు పెట్టుకుని యుద్ధానికి వెళుతున్న యోధుడిలా కనిపించడంతో ఫ్యాన్స్ , జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నేను రెడీ జన సైనికులారా మీరు రెడీ అంటూ క్యాప్షన్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.

ఇక శనివారం సాయంత్రం మంగళగిరిలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తాను ఏ ఒక్క కులానికో ప్రతినిధి కాదని .. ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను మానవత్వంతో పెరిగానని, జాతీయ భావాలతో పెరిగానని, కాకపోతే సమాజంలో ఏఏ కులాలు వెనుకబడి ఉన్నాయో వాటిని భుజాలమీదికి ఎత్తుకోవాలని కంకణం కట్టుకున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలని పవన్ అన్నారు. నేను కాపు నాయకుడిని కాదని, నేను కుల ఫీలింగుతో పెరగలేదు.. మానవత్వంతో పెరిగానని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘ కాపు రిజర్వేషన్లపై కొందరు బీసీ నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పారు. రేపు కాపు ప్రతినిధులతో జరిపే సమావేశంలో చర్చిస్తాను. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం. ఈ కాంబినేషన్ ఉంటే ఎవ్వర్నీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదు. రోజుకు అర్ధ రూపాయి తీసుకుని ఓటు అమ్ముకునే దుస్థితి పోతే.. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. బీసీలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. బీసీలంటేనే ఉత్పత్తి కులాలు. ఉత్పత్తి లేకుంటే సమాజమే లేదన్నారు.