ఇండోనేషియాలో భారీ భూకంపం

జకార్తా: ఇండోనేషియా లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 5.17 గంటలకు టోబెలోలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6.0గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం టొబెలోకు 259 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 174.3 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/