రెడ్ జోన్లలో కఠిన నిబంధనలు

ఇళ్ళల్లో నుంచి బయటకు అనుమతి లేదు

Street in Red Zone Area limits
Street in Red Zone Area limits

New Delhi: కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి విదితమే.

దేశ వ్యాప్త లాక్ డౌన్ లో భాగంగా రెడ్ జోన్ లలో పరిస్థితులకు మిగిలిన ప్రాంతాలకూ చాలా తేడా ఉంటుంది.

రెడ్ జోన్ ప్రాంతంలో అత్యంత కఠినమైన నిబంధనలు అమలులో ఉంటాయి. రెడ్ జోన్ ప్రాంతంలో ఉండే వారు బయటకు వచ్చేందుకు అనుమతి ఇవ్వరు.

బయటకు కాదు కదా కనీసం పక్కింటికి వెళ్లడానికి కూడా వీల్లేదు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలను అధికారులే ఇళ్ల వద్దకు చేరుస్తారు.

వాటిని కూడా ఇంట్లో నుంచి ఒకరు మాత్రమే బయటకు వచ్చి తీసుకోవాల్సి వుంటుంది.  

పక్క వీధిలో ఉంటున్న వారు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటున్నా, రెడ్ జోన్ పరిధిలోని వారు మాత్రం కనీసం ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా వీలుండదు. 

బయటి వారు ప్రాంతంలోకి వచ్చేందుకు  అనుమతి ఉండదు. 

రెడ్ జోన్ ప్రాంతానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధి వరకూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తారు.

సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రత్యేక వాహనాల సాయంతో పిచికారీ చేస్తారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com