తెలంగాణలో కరోనా నివారణ కొరకు కఠిన చర్యలు

కరోనా గొలుసు తెంపడమే లక్ష్యం

corona virus
corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. ఒక పాజిటివ్‌ కేసు నమోదు అయితే ఆ ప్రదేశానికి చుట్టు ఉన్న 100 ఇళ్లతో కంటైన్‌మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేయాలని ప్రకటించింది. అలాగే ఒకటి కన్నా ఎక్కువ కేసులు నమోదు అయితే ఆ ప్రాంతానికి చుట్టు 250 మీటర్ల పరిధిలో జోన్‌ ఏర్పాటు చేయాలి. అక్కడికి వెళ్లె మార్గాలను 8 అడుగుల ఎతైన బారికేడ్లతో మూసివేయాలి. సరియైన కారణం లేకుండా జోన్‌లోపలికి ఎవరిని వెళ్లనివ్వరు. అలాగే జోన్‌ లోపలి వారిని కూడా బయటికి పంపరు. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జోన్‌ లోని ప్రజలకు నిత్యవసరాలు 12 గంటలలోగా ఇళ్ల వద్దకే పంపుతామని తెలిపారు. ప్రతి జోన్‌ కు ఓ నోడల్‌ అధికారిని ప్రకటించి అతని ఫోన్‌ నంబర్‌ను ప్రతి ఇంటికి అందించాలని సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/