ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తే ఇక చుక్కలే!

కొత్త రూల్స్‌ రాబోతున్నాయ్!

Strict action if traffic rules are violated
Strict action if traffic rules are violated


ముంబై: ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇకపై వాహనదారులకు చుక్కలే. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటర్‌ ఐఆర్‌డిఎఐ కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. ట్రాఫిక్‌కు ఇన్సూరెన్స్‌కు సం బంధం ఏంటని అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఒకలింక్‌ ఉంది. మీరు ట్రాఫిక్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేస్తే, మీ వాహనాల ఇన్సూరెన్స్‌ ప్రీమి యం కూడా పెరుగుతుంది.

అంటే మీరు ట్రాఫిక్‌ చలానాతోపాటు ప్రీమియం కూడా ఎక్కువ కట్టాల్సి రావొచ్చు. ఐఆర్‌డిఎఐ ఇప్ప టికే తన ప్రతిపాదనలో తుది నివేదికను రెడీ చేసింది. తొలిగా ఈ రూల్స్‌ ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో అమల్లోకి రానుంది.

తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. వాహనాల ఇన్సూరెన్స్‌ రెన్యూవల్‌ చేసుకునే సమయంలో గత రెండేళ్ల నాటి ట్రాఫిక్‌ చలానాలను పరిగణలోకి తీసుకుని మీరు ప్రీమియం నిర్ణయిస్తారు. అందువల్ల మీరు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇష్టానుసారంగా వాహనాలు నడిపి ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. ట్రాఫిక్‌ పాయింట్లకు అనుగుణంగా వాహనాల ఇన్సూ రెన్స్‌ప్రీమియం కూడా పెరుగుతుంది. అదే మీరు ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించకపోతే ప్రీమియంలో తగ్గింపు కూడా లభిస్తుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/