హోం క్వారంటైన్ పాటించని వారిపై కఠిన చర్యలు
రోడ్లపై తిరిగితే కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విస్తరిణి అరికట్టేందుకు లాక్డౌన్ విదించిన సంగతి అందరికి తెలిసిందే. అయినప్పటికి రాష్ట్రంలో కొంతమంది మాత్రం తమకేమి పట్టదన్నట్టుగా రోడ్లమీద తిరిగెస్తున్నారు. మరీ ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారికి 14 రోజుల పాటు బయటికి రాకూడదని చెప్పినప్పటికి వారు పట్టించుకోకుండా ఉన్నారు. దీంతో అధికారులు వారిపై దృష్టి సారించారు. హోం క్వారంటైన్ నిబందనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న 16 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. లాక్డౌన్ పాటించకుండా రోడ్లమీద తిరిగితే కఠిన చర్యలు తీసుంటామని పోలీసులు అంటున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/