త్రివిధ దళాలను రాజకీయ ప్రయోజనాలకు వాడొద్దు

Navy, Army and Air Force
Navy, Army and Air Force

న్యూఢిల్లీ: త్రివిధ దళాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవదంటు మాజీ సైనికోద్యోగులు ప్రధాని మోడి ప్రభ్వుతంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రక్షణశాఖ మాజీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు లేఖ రాశారు. దాదాపు 156 మంది మాజీ సైనికోద్యోగులు ఆ లేఖ‌లో సంత‌కం చేశారు. ఆ లేఖ‌లో సంత‌కం చేసిన వారిలో మాజీ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు ఉన్నారు. మాజీ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్‌, జ‌న‌ర‌ల్ శంక‌ర్ రాయ్ చౌద‌రీ, జ‌న‌ర‌ల్ దీప‌క్ క‌పూర్‌తో న‌లుగురు మాజీ నేవీ చీఫ్‌లు ఉన్నారు. ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఎన్‌సీ సురి కూడా ఆ లేఖ‌లో సంత‌కం చేసిన‌వారిలో ఉన్నారు. స‌రిహ‌ద్దు దాటి ఉగ్ర‌వాదులను మిలిట‌రీ చంపేస్తుంటే.. దాన్ని కొన్ని పార్టీలు రాజ‌కీయం చేస్తున్నాయ‌ని మాజీలు ఆరోపించారు. ఇది అసంబ‌ద్ధ చ‌ర్య అని, రాజ‌కీయ ఎజెండా కోసం మిలిట‌రీని వాడ‌డం అమోద‌యోగ్యం కాద‌న్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/