ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే మార్గాలను వెతకండి: మన్మోహన్‌సింగ్‌

manmohan singh
manmohan singh

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముందుగా దాని సరిగ్గా అంచనావేసి లోటుపాట్లను తెలుసుకోవాలని చెప్పిన మన్మోహన్‌సింగ్‌ విపక్షాలను దుమ్మెత్తి పోయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని వెల్లడించారు. ప్రభుత్వ విధానాల వల్లే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని వీరు చేస్తున్న పొరపాట్లకు ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఆర్‌బిఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ ఉన్న సమయంలోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. అందుకు కౌంటర్‌గా మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ అస్తమానం విపక్షాలపై నిందలు వేయడం వల్ల ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేరని హితవు పలికారు. విపక్షాలపై నిందలు వేసే బదులు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మార్గాలను అన్వేషించాలని సూచించారు. డిమాండ్‌ తగ్గిపోవడంతో మహారాష్ట్రలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. మహారాష్ట్రలో పారిశ్రామిక రంగం కుదేలైందని చెప్పిన మన్మోహన్‌సింగ్‌ చైనా నుంచి విడిభాగాలను భారత్‌కు దిగుమతి చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. ద్వంద్వ ప్రభుత్వ విధానాలతో బిజెపి విఫలమైందని ధ్వజమెత్తిన మన్మోహన్‌సింగ్‌ ఓట్లను ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఆర్థిక వృద్ధి అతంయత దారుణంగి పడిపోయిందని వరుసగా నాలుగవసారి ఇది పడిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/