పెచ్చరిల్లుతున్న అవినీతిని అరికట్టాలి

Stop corruption
Stop corruption

నాటి నుంచి నేటి వరకు మన పాలకులు అవినీతిని అంతం చేయడం అటుంచి కనీసం తగ్గించలేకపోతున్నారు. రెవెన్యూశాఖలో కిందిస్థాయి ఉద్యోగి మొదలుకొని పైస్థాయి అధికారి వరకు ప్రజలు వారినెంతో గౌరవిస్తారు. ఎందుకంటే వారికి ఎక్కువ పనులుండేది వీరితోనే. కానీ నేడు రెవెన్యూ కార్యాలయాల్లో పోలీసు బుక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి అధికారులకు భద్రత కల్పించడం లాంటి వాటి ద్వారా రాబోయే రోజుల్లో ఏమి జరుగుతున్నదో సూచాయగా గోచరమవ్ఞతున్నది. రైతులకు, సామాన్యులకు సంబంధించిన అతి ముఖ్యమైన రెవెన్యూలో ఈ ఘర్షణ వైఖరి అశుభపరిణామం. దీన్నిమొగ్గ దశలోనే తుంచకుండా ఈ దశకు తెచ్చాం. ఇప్పటికయినా స్నేహపూర్వక వాతావరణానికి అందరూ కలిసి కృషి చేయాలి. దశాబ్దాలుగా పాసు పుస్తకాలకు కొరత. ఏమిటీ విచిత్రం, ఎక్కడుంది లోపం. కారణం ఏదయినా ఒక మహిళా తహసీల్దార్‌ను కార్యాలయంలోనే సజీవదహనం చేయడం హేయయమైన, అమానవీయ సంఘటన. తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.

వ్య వస్థకు పట్టిన చెదలే అవి నీతి. ఈ అవినీతి ‘ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వామనుడు పెరిగినట్లుగా పెరుగు తూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నీతి కొరవడినప్పుడు ఏర్పడేదే అవినీతి. న్యాయమూర్తికే లంచమి వ్వబోయి దొరికిపోయిన ఘనులు న్నారు. ఎంత సంపాదించినా చివరకు మిగిలేది బూడిదేనన్న సత్యాన్ని లంచగొండులు గుర్తించలేకపోవటం విచారకరం. అవినీతి సంపాదనకు అల వాటుపడిపోయిన కొందరు వ్యవస్థలనే శాసించే స్థాయికి చేరటం దేశానికి పట్టిన గ్రహణం.ఒక ఇంజినీరు తీసుకునే 10,20వేలు లంచం ఆకట్టడం లేదా ఆ నిర్మాణ నాణ్యతను డొల్లగా మారుస్తుంది. దూరంగా ఉన్నప్పుడు అవినీతిపై గొంతెత్తేవారే అవకాశం వచ్చినప్పుడు అవినీతికి పాల్పడటానికి వెనుకాడకపోవడం విచారకరం.

అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో కొందరు నిజాయితీపరులు, వ్యవస్థ ఎంత చెడిపోయినా వారు మాత్రం నిప్పుకణికల్లా మెరుస్తూ ప్రజల నుంచి ప్రసార మాధ్యమాల నుంచి ప్రశంసలందుకుంటున్నారు. నాటి నుంచి నేటి వరకు మన పాలకులు అవినీతిని అంతం చేయడం అటుంచి గణనీయంగా తగ్గించలేకపోతున్నారు. రెవెన్యూశాఖలో కిందిస్థాయి ఉద్యోగి మొదలుకొని పైస్థాయి అధికారి వరకు ప్రజలు వారినెంతో గౌరవిస్తారు. ఎందుకంటే వారికి ఎక్కువ పనులుండేది వీరితోనే. కానీ నేడు రెవెన్యూ కార్యాలయాల్లో పోలీసు బుక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి అధికారులకు భద్రత కల్పించడం లాంటి వాటి ద్వారా రాబోయే రోజుల్లో ఏమి జరుగుతున్నదో సూచాయగా గోచరమవ్ఞతున్నది. రైతులకు, సామాన్యులకు సంబంధించిన అతి ముఖ్యమైన రెవెన్యూలో ఈ ఘర్షణ వైఖరి అశుభపరిణామం. దీన్నిమొగ్గ దశలోనే తుంచకుండా ఈ దశకు తెచ్చాం.

ఇప్పటి కయినా స్నేహపూర్వక వాతావరణానికి అందరూ కలిసి కృషి చేయాలి. దశాబ్దాలుగా పాసు పుస్తకాలకు కొరత. ఏమిటీ విచిత్రం, ఎక్కడుంది లోపం. కారణం ఏదయినా ఒక మహిళా తహసీల్దార్‌ను కార్యాలయంలోనే సజీవదహనం చేయడం హేయయమైన, అమానవీయ సంఘటన. తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. పోలీసురక్షణ కల్పించడం లేదా కార్యాలయాల్లో కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్‌ కార్యాలయంలో లాగా అడ్డంగా తాళ్లుకట్టడం సమస్యకు పరిష్కారం కాదు. సుహృద్భావ వాతావరణం ఉండాల్సిన చోట ఘర్షణ వాతావరణం మంచిదికాదు. అధికారులు, పౌరులు పరస్పరం గౌరవించుకోవాలి. పొలం అసైన్డ్‌కానందున ప్రకాశంజిల్లాలో వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన రైతు గతంలో ఎమ్‌ఆర్‌ఒ కార్యాలయం దగ్గరలో ఆత్మహత్య చేసుకున్నాడు. అవినీతి నిరోధక శాఖ జరిపే దాడుల్లో కోటానుకోట్లు బయటపడుతున్నాయి. ఠాగూర్‌ సినిమాలో చూసినట్లుగా ఎసిబి దాడులు ముమ్మరం చేస్తే ఎంత మంది కటకటాలు లెక్కబెట్టాల్సి వస్తుందో. తాము చేస్తున్న తప్పుడు పనుల కోసం లంచాలు మేపే వారు కొందరయితే, మరికొందరికి న్యాయంగా తమకు జరగాల్సిన పనులు జరగక లంచం ఇవ్వవలసిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఎసిబి అధికారులు అనేక మందిపై దాడులు జరిపి కేసులు నమోదు చేస్తున్నారు.

దివ్యాంగుల శాఖను కూడా అవినీతి పట్టిపీడిస్తున్నట్లు ప్రకాశం జిల్లాలో జరిగిన విచారణలో బయటపడింది. ఒక డే కేర్‌ సెంటర్‌కు అనుమతికి రెండు లక్షలకు బేరమాడి ఆ వీడియో బయటపడి అడ్డంగా బుక్కయ్యాడు ఆ శాఖ ఎడి. కర్నూలులో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఒక మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్‌ లెక్కల ప్రకారం పది కోట్లు. అదే బహిరంగ మార్కెట్లో 80 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. రవాణాశాఖలో ఇప్పటికీ ఇదే భారీ మొత్తం అంటున్నారు. దొరికినవారు కొందరైతే దొరకని దొంగలు చాలా మంది ఉన్నారు. లంచావతారుల సంపాదన మూడుపువ్ఞ్వలు ఆరు కాయలుగా సాగుతుంది.

వీరు లంచాల కోసం ఏమైనా చేస్తారు. ప్రపంచంలో నీతివంతమైన దేశాల జాబితాలో తొలి ఐదు దేశాలు న్యూజిలాండ్‌, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, నార్వే, స్విట్జర్లాండ్‌లుకాగా మనదేశం 81వస్థానంలో ఉంది. వివిధ శాఖల్లో అవినీతి విశృంఖ లంగా ఉంది. ఈ అవినీతి క్యాన్సర్‌లా పాకిపోయి ఉంది. ఇందు గలడందు లేడు అన్నట్లుగా అన్ని చోట్లా అవినీతి విస్తరించిపో యింది. చివరకు శవపరీక్షల దగ్గర కూడా కొన్నిచోట్ల లంచాలి వ్వాల్సిన పరిస్థితి. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం ఒక కేసు విచారణ సందర్భంగా ఆర్థిక నేరం హత్యకన్నా ప్రమా దకరమైనదని, అవినీతి వలన జరిగే నష్టాలను కళ్లకు కట్టినట్లు చెప్పింది. ప్రజల నిర్లిప్తత, ఉదాసీనతతో లంచాల సంస్కృతి పెరుగుతున్నది.

అవినీతితో అనేక నిర్మాణాలు కొన్ని సంవత్స రాలకే పనికిరాకుండాపోతున్నాయి. మరలా వాటి మరమ్మతుల పేరిట లక్షలు స్వాహా చేస్తున్నారు. అవినీతిపరులు ప్రతిదాన్ని అక్రమ సంపాదనకు అవకాశంగా మలచుకుంటున్నారు. బ్రిటిష్‌వారి పాలనలో వారిని ప్రశంసించే అంశం వారి నిర్మాణాలు. వారు నిర్మించిన రైల్వే వంతెనలతో సహా కొన్ని నిర్మాణాలు నేటికీ బాగు న్నాయి. అవినీతితో ఇప్పటి కొన్ని నిర్మాణాలు 10 సంవత్సరా ల్లోనే పగుళ్లిచ్చి మనలను వెక్కిరిస్తున్నాయి. నిన్నకాక మొన్న వర్షానికి తలదాచుకోవడానికి భాగ్యనగరంలో మెట్రో నిర్మాణం కింద నిలబడిన యువతి తలపై సిమెంట్‌ పెచ్చు ఊడిపడి మర ణించడం వంటి సంఘటనలతో నయినా మనం మేల్కొనాలి. లోపాలను గుర్తించాలి. నిజాయితీతో పనిచేసే అధికారులకు చాలా సార్లు బదిలీలువారి నిజాయితీకి కానుకలుగా లభిస్తున్నాయి.

మన దేశంలో లంచాల బాధితుల్లో ఎక్కువ మంది పేదలు, మధ్య తర గతి వారే కావటం గమనార్హం. పటిష్ట చట్టాలు చేయడం వాటిని సమర్థవంతంగా అమలు చేస్తేనే అవినీతిని కూకటివేళ్లతో పెకిలించ డం సాధ్యమవ్ఞతుంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు కొట్టొచ్చిన్నట్లు కనబడే విధంగా అవినీతి శాఖ అధికారుల ఫోన్‌ నెంబర్లు రాయించాలి.

అవినీతి డబ్బుకు అలవాటుపడి లంచాలు మేస్తున్న వారి పాలిట సింహస్వప్నంలా నిఘా సంస్థలు నిలబ డితేనే అభాగ్యులకు ఊరట లభిస్తుంది. ఏటా దేశంలో మూడు లక్షల కోట్ల రూపాయలను అవినీతి సంపాదన రూపంలో పోగే స్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. రాజకీయ అవినీతితో సహా అన్నిరకాల అవినీతిని రూపుమాపాలి. అవినీతి బకాసురులను వదలనన్న ప్రధాని మాటలు కార్యరూపం దాల్చాలి. దొరికిపోతా మనే భయముంటే అవినీతిజరగదు. పాఠశాల స్థాయినుంచే అవి నీతిజాడ్యం గురించి,దానివల్ల నష్టాలగురించి అవగాహన పెంపొం దించాలి.గతంతో పోలిస్తే ఇటీవల అవినీతి కేసుల్లో శిక్షలు పడేవారి సంఖ్య పెరుగుతుండటం సామాన్యులకు ఊరటకలిగించే అంశం.

-రావి శ్రీనివాసరావు