నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు. సెన్సెక్స్‌ 76 పాయింట్లు పతనమై 40,575 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలలో 30 పాయింట్లు నష్టాన్ని చవిచూసి 11,970 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ఐషర్‌ మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాన్ని గడించాయి. కాగా కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, యస్‌ బ్యాంక్‌, బిపిసిఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాన్ని చవి చూశాయి. మొత్తంగా లోహ, ఇన్‌ఫ్రా, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, ఇంధన రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.74గా కొనసాగుతుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌చేయండి:https://www.vaartha.com/news/sports