ఆర్‌బిఐ రెపోరేట్లపైనే ఆశలు

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

RBI bank
RBI bank

ముంబయి: మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూ వస్తోంది. సెన్సెక్స్‌ 199 పాయింట్లు నష్టపోతే నిఫ్టీ కూడా అదే తరహాలో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ధోరణులు నీరసించడం, సూచీల్లోని భారీ కంపెనీలు హెచ్‌డిఎప్‌సి ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌బ్యాంకు వంటివి కౌంటర్లలో అప్రమత్తతో కూడిన కొనుగోళ్లు వంటివి ఉంటాయి. ఆర్‌బిఐ మానిటరీ పాలసీ సమీక్ష వివరాలు శుక్రవారం వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ గురువారం కొంతమేర ప్రతికూలంగానే నడిచింది. ఎంపికచేసిన స్టాక్స్‌ ఎస్‌బ్యాంకు, ఎబ్బట్‌ ఇండియా సంస్థలు మాత్రమే ర్యాలీ తీసాయి. బెంచ్‌మార్క్‌ బిఎస్‌ఇ సెన్సెక్స్‌199 పాయింట్లు క్షీణించి 38,106.87 పాయింట్లవద్ద ముగిసింది. వేదాంత ఐదుశాతం దిగజారింది. ఎస్‌బ్యాంకు 33శాతం వరకూ లాభపడి అతిపెద్ద లాభాలసంస్థగా నిలిచింది. ఈ రోజుమొత్తం సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 38,310.93 పాయింట్లు వద్దనుంచి 37,957.56 పాయింట్లవద్ద రిజిష్టరు అయింది. ఎస్‌బ్యాంకు గతంలో ఎన్నడూలేని విదంగా భారీ ఎత్తున లాభపడిందది. సిఇఒ రవ్‌నీత్‌గిల్‌ ఇన్వెస్టర్లకు బ్యాంకు తీరుపై భరోసా ఇవ్వడంతో ఆర్ధికరంగంలో అతిపెద్ద లాభాలసంస్థగా నిలిచింది. బ్యాంకు స్టాక్‌ రూ.42.55 వద్ద బిఎస్‌ఇలో ముగిసింది.

అంతకుముందురోజుకంటే 33శాతం పెరిగింది. మార్కెట్‌పరంగా చూస్తే 2651 కంపెనీలు బిఎస్‌ఇలోట్రేడింగ్‌ జరగితే 961 కంపెనీలు లాభాల్లో ముగిసాయి. 1530 కంపెనీలునష్టాలతో ముగిస్తే 160 కంపెనీల వాటాలు స్థిరంగా కొనసాగాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌సూచీ 13,844.48 పాయింట్లవద్ద అంటే 42 పాయింట్ల దిగువన ముగిసింద.ఇ బిఎస్‌ ఇస్మాల్‌క్యాప్‌సూచ 49 పాయింట్లు దిగజారి 12,910.18 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక వివిధ సూచీలవారీగా ఎన్‌ఎస్‌ఇలో మెటల్‌స్టాక్స్‌ దిగజారాయి.

నిఫ్టీ మెటల్‌సూచీ మూడుశాతం క్షీణించింది. మొత్తం 15 విభాదాల్లో 14 సూచీలు ప్రతికూలంగానే ముగిసాయి. నిఫ్టీ ఫైనాన్స్‌సర్వీస్‌సూచీ పరంగాచూస్తే ఒకటిశాతం క్షీణించింది. ఇతరత్రా రియాల్టీ స్టాక్స్‌ ఒకటిశాతంపెరిగి 250.90స్థాయికి చేరాయి. ఇండస్‌ఇండ్‌బ్యాంకు షేర్లు నాలుగోరోజు కూడా దిగజారాయి. రరెండేళ్ల కనిష్టానికి అంటే 1220వద్ద ముగిసాయి. ఆరుశాతం బిఎస్‌ఇలో క్షీణించింది. గురువారం బ్యాంకు స్టాక్స్‌ సమస్యాత్మక కేటగిరీకి చేరడమే ఇందుకుకీలకం. ప్రైవేటు బ్యాంకరు 20-17 జనవరి 23 నుంచి దిగువస్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఆర్‌బిఐ తన రెపో సమీక్షలో రెపోరేట్లను మరో 25బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తుందని చెపుతున్నారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/