లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆరు రోజుల వరుస నష్టాలకు ముగింపు పడింది. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తీవ్ర ఒడిదుడుకులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 52,973కి పెరిగింది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 15,842 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్ సూచీలు మినహా ఇతర సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/