లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఉత్సాహంగా కదలాడాయి. దేశీయ మార్కెట్లు 0.8 శాతం వృద్ధితో లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 465.14 పాయింట్ల మేర లాభపడి 58,853.07 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇవాళ ఆశావహరీతిలో ఫలితాలు అందుకుంది. నిఫ్టీ 127.60 పాయింట్ల వృద్ధితో 17,525.10 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలీస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.63 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/