లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

stock market

Stock markets ended in profit

ముంబై, : దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం నుంచీ లాభాల్లోనే ట్రేడయి చివరికి సెన్సెక్స్‌ 178పాయింట్ల లాభంతో 38,862వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 68పాయింట్లు పెరిగి 11,666 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల నేపథ్యంలో మొదట మార్కెట్లు ప్రోత్సాహకరంగా ప్రారంభమయ్యాయి. ఎన్‌ఎస్‌ఇలో మెటల్స్‌ రెండు శాతం లాభపడగా, రియాల్టీ, ఐటి, ప్రైవేట్‌ బ్యాంకులు ఒక శాతం స్థాయిలో పెరిగాయి. అయితే పిఎస్‌యు బ్యాంకులు, ఎఫ్‌ఎంసిజి 0.5శాతం స్థాయిలో క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హిండాల్కో, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంతా, ఐషర్‌ ఇండియా, ఐఒసి, సిప్లా, గ్రాసిమ్‌ 4నుంచి 2 శాతం మధ్య పెరిగాయి. అయితే పవర్‌గ్రిడ్‌, బ్రిటానియా, జి, ఎస్‌బిఐ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎన్‌టిపిసి, హీరోమోటో, ఎస్‌ బ్యాంకు, హెచ్‌సిఎల్‌టెల్‌, సన్‌ఫార్మా 1.5శాతం నుంచి 0.5శాతం మధ్య పతనమయ్యాయి. మార్కెట్లు లాభాలతో ముగిసిన నేపథ్యంలో మధ్య, చిన్నస్థాయి షేర్లకూ డిమాండ్‌ పెరిగింది. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ 0.65శాతం చొప్పున పెరిగాయి.
అదానీ పవర్‌ 50.30 4.90
టాటాస్టీల్‌ 550.20 3.68
వేదాంతా 191.75 2.43
హిండాల్కో 215.40 2.35
ఎసిసి 1665.50 2.25
విప్రో 262.25 1.24
ఇన్ఫోసిస్‌ 759.00 1.48
టిసిఎస్‌ 2047.50 1.64
ఒఎన్‌జిసి 156.60 0.87
బాటాఇండియా 1415.00 0.98
హెచ్‌డిఎఫ్‌సిబ్యాంకు2309.10 1.10
ఎన్‌టిపిసి 134.85 -0.59
టివిఎస్‌ మోటార్స్‌485.15 -0.59
సన్‌ఫార్మా 463.80 -0.39
ఇండియన్‌ బ్యాంకు274.15 -0.11
కోల్‌ఇండియా 234.50 -0.13
లూపిన్‌ 787.50 -0.20
బయోకాన్‌ 611.30 -0.24
ఏసియన్‌ పెయింట్స్‌1514.35 -0.31
టాటామోటార్స్‌ 205.40 -0.36
హెచ్‌సిఎల్‌ 1093.90 -0.38
ఐటిసి 294.75 -0.02

మరిన్నీ తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చెయండి : https://www.vaartha.com/news/business/