స్వల్ప లాభాలలో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో నేటి ట్రేడింగ్ నష్టాలలోనే మొదలైంది. ఒకానొక దశలో సెన్సెక్స్ సుమారు 600 పాయింట్ల వరకు పడిపోయింది. అయితే, మధ్యాహ్నం తర్వాత కోలుకుని, రికవర్ అవడంతో మార్కెట్లు స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి. దీంతో 76.77 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52551.53 వద్ద.. 12.50 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15811.85 వద్ద ముగిశాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/