లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఒకానొక దశలో సూచీలు నష్టాలలోకి మళ్లాయి. తర్వాత మళ్లీ కొనుగోళ్లు జరగడంతో పుంజుకుని, చివరికి లాభాలలోనే ముగిశాయి. దీంతో 228.46 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52,328.51 వద్ద… 81.40 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,751.65 వద్ద క్లోజయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.80 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/