ఊగిసలాటలో మార్కెట్లు

stock market
stock market

ముంబై: నేడు దేశీయ మార్కెట్లు ఒడుదుడుకుల్లో ఉన్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 43 పాయింట్ల లాభంతో 37,133 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు నష్టంతో 11,120 వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం కారణంగా మార్కెట్లలో ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికే అమెరికా చైనాకు చెందిన వస్తువులపై టారీఫ్‌లను పెంచడంతో చైనా కూడా దీనికి ప్రతీకారంగా అమెరికాకు చెందిన 60 బిలియన్‌ డాలర్ల వస్తువులపై టారీఫ్‌లను పెంచింది. ఇది జూన్‌1 నుంచి అమల్లోకి రానుంది. జపాన్‌, ఆస్ట్రేలియా సూచీలు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/