కరోనా కలకలం..స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిలిపివేత

10 శాతానికి మించి పతనమైన నిఫ్టీ

SENSEX
SENSEX

ముంబయి: ఈరోజు స్టాక్‌ మార్కెట్లు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో లోయర్ సర్క్యూట్ ను తాకాయి. సూచికలు 10 శాతం పతనం కాగానే, ట్రేడింగ్ ను నిలిపివేస్తున్నట్టు సెబీ వర్గాలు ఆదేశించాయి. సరిగ్గా 9.21 గంటల సమయంలో సెన్సెక్స్ సూచిక 29,687.52 పాయింట్ల వద్ద ఉన్న సమయంలో ట్రేడింగ్ ను నిలుపుదల చేశారు. ఎన్ఎస్ఈ సూచిక 10.07 శాతం పడిపోయి 8,624 పాయింట్ల వద్ద ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 966 పాయింట్లు తక్కువ.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/