తనకు తానుగా శిక్ష విధించుకున్న స్టీవ్‌ స్మిత్‌

Steve Smith
Steve Smith

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తనకు తాను శిక్ష విధించుకున్నాడు. బ్రిస్బేన్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో షాక్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షా చేతిలో స్మిత్‌ క్లీన్‌బౌల్డ్‌ అయిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో వంద పరుగులు చేసినప్పుడు స్టీవ్‌ స్మిత్‌ చాక్లెట్‌ బార్‌లు తినే సంగతి తెలిసిందే. అదే సమయంలో భారీ స్కోర్లు చేయకుండా పెవిలయన్‌కు చేరినప్పుడు తనకు తాను శిక్ష విధించుకుంటాడు. దీంతో తనలో తాను కసిని పెంచుకునేందుకు కావాలని బస్సు మిస్‌ అయ్యి స్టేడియం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్‌ వరకు పరిగెత్తాడు. యాసర్‌ చేతిలో ఔటైనందుకు ఆందోళన లేదని, ఫంకీ షాట్లు ఆడుతున్నాను తెలిపాడు. వచ్చే మ్యాచ్‌లో రాణించాలని అతడు నాకు ప్రేరణ కల్పించాడు. అతడి బౌలింగ్‌లో క్రమశిక్షణగా ఆడతాను అని స్మిత్‌ అన్నాడు. తొలి టెస్టులో పాకిస్థాన్‌పై ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్మిత్‌ నాలుగు పరుగులే చేశాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/