దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత : కేజ్రీవాల్
31 తర్వాత లాక్ డౌన్ ఆంక్షల సడలింపు

New Delhi: ఢిల్లీలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో ఆన్ లాక్ ప్రక్రియను ప్రారంభిస్తామని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. కాగా 24 గంటల్లో 1100 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ప్రజలు ఒకింత ఆకలితో చనిపోయే పరిస్థితి నెలకొందని, దశల వారీగా ఆన్ లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్టు తెలిపారు. వారం రోజుల్లో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తివేస్తామని, అందరి ఏకాభిప్రాయం తో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.జీవనోపాధి కోసం దూర ప్రాంతాల నుండి ఢిల్లీకి వచ్చిన రోజువారీ కూలీలు, కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తామని వెల్లడించారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/