కర్నూలు జిల్లాలో సీతారాముల విగ్రహాలు ధ్వంసం
స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం

Kurnool: కర్నూలు జిల్లా జిల్లాలోని కోసిగి మండలం మర్లబండలోని ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
గోపురంపై ఉన్న విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతేకాదు ఆలయంలోని హుండీలను కూడా అపహరించారు.
జరిగిన ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/