లాక్‌డౌన్‌ను పొడగించే యోచనలో రాష్ట్రాలు?

కరోనా కేసులు భారీగా పెరుగుతుండడమే కారణం

lock down
lock down

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడి ప్రధాని నరేంద్రమోది విధించిన రెండో దశ లాక్‌డౌన్‌ మే 3 తో ముగియనుంది. ఇప్పటికి పలు రాష్ట్రాలలో కరోనా కట్టడి కాకపోవడంతో మళ్లీ ఆ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ను పొడగించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే మహరాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఈ విషయాన్ని పలు సందర్బాలలో ప్రస్తావించాయి. లాక్‌డౌన్‌ పొడగించే ఆలోచనలో ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. మహరాష్ట్రలో కూడా కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో అక్కడ కూడా లాక్‌డౌన్‌ను పొడగించాలని అధికారలు భావిస్తున్నారు. దేశంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే కరోనాను అదుపు చేయలేమని పలు రాష్ట్రాలు సూచిస్తున్నాయి. కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న గుజరాత్‌, రాజస్థాన్‌, తమిళనాడు, యూపీ రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ను పొడగిస్తామనే సంకేతాలు ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కు మందు లేకపోవడం, నివారణ ఒక్కటే మార్గం కావడంతో అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడగించే యోచన చేస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/