ఇప్పటి వరకు 29 ‘కరోనా’ పాజిటివ్‌ కేసులు

రాజ్యసభలో తెలిపిన కేంద్రమంత్రి హర్షవర్ధన్‌

YouTube video

Statement by Union Health Minister Shri Harsh Vardhan on measures against the spread of Coronavirus

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ గురువారం కరోనా వైరస్‌పై రాజ్యసభలో మాట్లాడుతూ..ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 29 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు తెలిపారు.ఢిల్లీ, ఆగ్రా, తెలంగాణ, రాజస్థాన్‌లో పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయన్నారు. కరోనా నియంత్రణకు కేంద్రం కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. నగరాల్లోని ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో వైద్యపరీక్షలు చేస్తున్నామన్నారు. జపాన్‌, దక్షిణకొరియా, ఇతర దేశాలకు వీసాలు రద్దు చేశామని, ఓడరేవుల ద్వారా వచ్చేవారికి పరీక్షలు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించామని హర్షవర్ధన్‌ వెల్లడించారు. యూపీ, ఉత్తరాఖాండ్, సిక్కిం, బిహార్‌ సరిహద్దుల్లో ముందు జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. దేశ సరిహద్దుల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని, కరోనా ప్రభావిత దేశాల నుంచి భారతీయులను వెనక్కి రప్పిస్తున్నామన్నారు. అందరికీ వైద్య పరీక్షలు చేయించామని, నమూనాలు పరీక్షకు పంపామని హర్షవర్ధన్‌ వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/