అప్పులు ఊబిలోకి రాష్ట్రం.. అచ్చెన్నాయుడు

ఏడాదిలోనే రూ.77 వేల కోట్లు అప్పు చేశారు

achennayudu
achennayudu

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ఏడాదిలోనే రూ.77వేల కోట్లు అప్పుుచేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ఏపి టిడిఎల్పి ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రజల భవిష్యత్‌ అంధకారంలోకి వెళ్లిందని, రాజధాని అమరావతి, పోలవరం పనులు ఆగిపోయాయని అన్నారు. కరోనా కారణంగా సామాన్య ప్రజలు ఉఫాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ కాంట్రాక్టర్లపై చూపిస్తున్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై కూడా చూపాలని హితవు పలికారు. దిల్లి తరహలో పేదలకు రూ. 5 వేలు నగదు ఇచ్చి వారిని ఆదుకోవాలని తెలిపారు. ఈ విషయాన్ని అచ్చెన్నాయుడు ట్విట్టర్‌ వేదికగా పేర్కోన్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/