రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలో అంశం

రాజధాని అమరావతిపై యనమల వ్యాఖ్యలు

Yanamala Rama Krishnudu
Yanamala Rama Krishnudu

అమరావతి: ఏపిలో మూడురాజధానుల అంశంపై టిడిపి సీనియర్‌ నేత యనమల రామకష్ణుడు మాట్లాడుతూ.. రాజధాని ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని అన్నారు. . పునర్విభజన చట్టంలో ఏముందో ఆయన గుర్తుచేశారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సిఫార్సులకు తగ్గట్టుగా రాజధాని ఏర్పాటు అవ్వాలని ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. శివరామకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుందని వివరించారు. విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందన్న ఆయన రాజధానులు అని లేదు అని గుర్తుచేశారు. ఒకవేళ వైఎస్‌ఆర్‌సిపి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటే విభజన చట్టంలో సవరణలు అవసరం అన్నారు .

తద్వారా ఈ అంశం కేంద్రం పరిధిలో ఉన్నట్లుగా భావిస్తోంది టిడిపి. పరిపాలన వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయ యనమల వాటిపై విధాన మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. బిల్లుల్ని ఆమోదించడమో, వ్యతిరేకించడమో చెయ్యాలన్నారు. దీనిపై ప్రజాభిప్రాయం తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న యనమల రాష్డ్ట్ర ప్రజలు మాత్రం భిప్రాయం మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఐతే… కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు రాజధానిగా అమరావతిని కోనసాగించాలని కోరుతున్నా మిగతా జిల్లాల ప్రజల్లో అభిప్రాయం అలా లేదని వైఎస్‌ఆర్‌సిపి వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల టీడీపీ నేతల మాటల్ని తాము పట్టించుకునేది లేదంటున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/