SBI ఖాతాదారులకు షాక్

నవంబర్‌ 1నుండి కొత్త నిర్ణయం అమలులోకి!

SBI
SBI

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు షాకిచ్చింది. సేవింగ్స్ అకౌంట్‌పై డిపాజిట్‌ రేట్లను తగ్గించింది. దీంతో బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయాలని భావించే వారికి తక్కువ రాబడి వస్తుంది. నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.

వ్యవస్థలో లిక్విడిటీ సరిపడినంత స్థాయిలోనే ఉందని స్టేట్ బ్యాంక్ పేర్కొంది. సేవింగ్స్ అకౌంట్లపై రూ.లక్ష వరకు డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రిజర్వు బ్యాంక్ కీలక రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ రేట్ల కోత నిర్ణయంతో సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు రూ.3.5 శాతం నుంచి 3.25 శాతానికి దిగొస్తుంది. రూ.లక్షలోపు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. అదేసమయంలో రూ.లక్ష పైన బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. దాదాపు ఎక్కువ మంది అకౌంట్లలో రూ.లక్షకు లోపే బ్యాలెన్స్ ఉంటుంది. దీంతో బ్యాంక్ నిర్ణయంలో ఎక్కువ మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది. స్టేట్ బ్యాంక్ దారిలోనే ఇతర బ్యాంకులు కూడా నడుస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో బ్యాంకుల్లో డిపాజిట్లపై తక్కువ రాబడి లభిస్తుంది. 
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/