కీలకమైన చివరి వన్డే ఆరంభం

last odi of the series
last odi of the series


న్యూఢిల్లీ: టీమిండియాతో జరుగుతున్న చివరి వన్డేలో టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. సిరీస్‌ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకం. ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. షాన్‌ మార్ష్‌ స్థానంలో స్టాయినిస్‌, బెహ్రండార్ఫ్‌ స్థానంలో నేథన్‌ లయన్‌ టీమ్‌లోకి వచ్చారు. ఇటు టీమిండియా కూడా రెండు మార్పులు చేసింది. చాహల్‌ స్థానంలో జడేజా, రాహుల్‌ స్థానంలో షమి టీమ్‌లోకి వచ్చాడు.
ఉస్మాన్‌ ఖ్వాజా, ఆరోన్‌ ఫించ్‌లతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 13 ఓవర్లలో 67 పరుగులు చేసింది. ఇంతవరకు వికెట్‌ కోల్పోలేదు. ఉస్మాన్‌ ఖ్వాజా(44) అర్ధ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు. ఫించ్‌(23) పరుగులు చేశారు.