బిపిన్​ రావత్​ మృతదేహానికి తమిళనాడు సీఎం స్టాలిన్​ నివాళి

బిపిన్​ రావత్​ మృతదేహానికి తమిళనాడు సీఎం స్టాలిన్​ నివాళి

తమిళనాడు కూనూరు సమీపంలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఈయనతో పాటు ఈయన భార్య తో సలహా మరో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంపై యావత్ దేశ ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం వెల్లింగ్టన్‌ మద్రాస్ రెజిమెంటల్ కేంద్రంలో బిపిన్ రావత్ మృతదేహానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. హెలికాప్టర్​ ఘటనలో మరణించిన 13 మందికి సీనియర్ సైన్యాధికారులు, తమిళనాడు మంత్రులు, ఆర్మీ వెటరన్లు పుష్పాంజలి ఘటించారు. ఈ క్రమంలో బిపిన్ రావత్ మృతదేహానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ నివాళులు అర్పించారు. హెలికాప్టర్ ఘటనలో మరణించిన 13మందికి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ హెలికాప్టర్ ప్రమాదం పై లోక్ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. సుల్లూరు ఎయిర్ బేస్ నుంచి నిన్న.. ఉదయం 11:48 గంటలకు హెలి కాప్టర్ టేకాఫ్ అయిందన్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు వెల్లింగ్టన్ లో ల్యాండ్ కావాల్సి ఉందని ఆయన తెలిపారు. కానీ మధ్యాహ్నం 12:08 గంటలకు సుల్లూరు ఏటీపీ విమానానికి కాంటాక్ట్ తెగిపోయిందని రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ఈ ప్రమాద ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు అని ఆవేదన వ్యక్తం చేశారు.