నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం

నిన్నటితో పోలిస్తే ఈ రోజు బాగా మెరుగు: ‘అపోలో’

Rajinikanth
Rajinikanth

Hyderabad: సినిమా షూటింగ్ లో ఉండగా అస్వస్థతకు గురై హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

అపోలో ఆసుపత్రి వైద్యులు ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిన్నటితో పోలిస్తే ఈ రోజు బాగా మెరుగుపడిందన్నారు. ఆయనకు చేసిన వైద్య పరీక్షల ఫలితాలు ఈ సాయంత్రం లోగా వస్తాయన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/