దేశంలో ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం అనేది మంచి సంకేతం

ఒక్కసారిగా గణంకాల్లో వృద్ధి ఉంటుందని ఆశించడం లేదు

nirmala sitharaman
nirmala sitharaman

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం అనేది మంచి సంకేతమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఒక్కసారిగా గణాంకాల్లో వృద్ధి ఉంటుందని తాను ఆశించడం లేదన్నారు. జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో నిర్మలా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా వ్యాప్తికి సంబంధించి ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఇలాగే రెండు మూడు వారాలు కొనసాగితే సవాలుగా మారే అవకాశం ఉందని మాత్రం ఆమె చెప్పారు. మన దేశంలోని ఫార్మాసూటికల్‌, ఎలక్ర్టానిక్‌ పరిశ్రమలు అత్యధికంగా చైనా నుంచి వచ్చే ముడిసరుకులపై ఆధారపడి ఉన్నాయి. అవసరమైతే విమానాల ద్వారా అత్యవసర ఉత్పత్తులను సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/